టీఆర్ఎస్ కు బోడిగె శోభ గుడ్ బై.. దళిత మహిళకు అన్యాయం చేశారంటూ కంటతడి!
- టీఆర్ఎస్ అధిష్ఠానంపై ఆగ్రహం
- మద్దతుదారులతో నేడు భేటీ
- బీజేపీ గూటికి చేరొచ్చంటున్న సన్నిహితులు
తన భవిష్యత్ కార్యాచరణను రేపు ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడిస్తానని శోభ తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ రద్దు తర్వాత అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్, చొప్పదండి నియోజకవర్గంపై మాత్రం సస్పెన్స్ కొనసాగించారు. నియోజకవర్గంలో శోభ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పలువురు సీనియర్ నేతలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. అలాగే నియోజకవర్గంలో శోభ అనుచరుల తీరుపై అనేక ఫిర్యాదులు పార్టీకి అందాయి. ఈ నేపథ్యంలో శోభకు టికెట్ కేటాయించేందుకు టీఆర్ఎస్ హైకమాండ్ నిరాకరించినట్లు సమాచారం. కాగా, శోభ బీజేపీలో చేరే అవకాశముందని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి.