కొండా సురేఖను గెలిపిస్తే.. గూండా రాజకీయం మళ్లీ మొదలవుతుంది: చల్లా ధర్మారెడ్డి
- పరకాల నియోజకర్గం ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది
- సురేఖ గెలిస్తే.. మళ్లీ అరాచకం మొదలవుతుంది
- కేసీఆర్ సంక్షేమ కార్యక్రమాలే మమ్మల్ని గెలిపిస్తాయి
మీకు ప్రశాంతమైన రాజకీయం కావాలో, గూండా రాజకీయం కావాలో తేల్చుకోవాలంటూ ఓటర్లను ఉద్దేశిస్తూ అన్నారు. కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని చెప్పారు. ఎన్ని పార్టీలు కూటమిగా వచ్చినా, టీఆర్ఎస్ దే విజయమని అన్నారు. పరకాల మండలం కంఠాత్మకూర్ గ్రామంలో ఈరోజు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఆయన... ఈ మేరకు వ్యాఖ్యానించారు.