ఔను... అతనితో డేటింగ్ చేస్తున్నా: సుస్మితా సేన్
- రోమన్ తో డేటింగ్ చేస్తున్నా
- ఇప్పటికీ పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు
- పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన సుస్మిత
మోడల్ రోమన్ ను కొన్ని నెలల క్రితం సుస్మిత కలిసింది. పలుమార్లు వీరిద్దరూ కెమరాల కంటికి చిక్కారు. ఇద్దరూ కలసి తాజ్ మహల్ కూడా సందర్శించారు. ఎంతో మంది సెలబ్రిటీ డిజైనర్ల కోసం రోమన్ ర్యాంప్ వాక్ చేశారు. మరోవైపు 40 ఏళ్లు దాటిన సుస్మిత ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. ఇద్దరు అమ్మాయిలను ఆమె దత్తత తీసుకుని, పెంచుకుంటోంది.