నాకు రూ.30 లక్షలు వస్తే.. ఈటల రాజేందర్ అంతా లాక్కున్నారు!: మాజీ డ్రైవర్ మల్లేశ్
- తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నా
- దాదాపు 45 రోజులు జైలుకు వెళ్లాను
- నా ప్రాణాలకు ప్రమాదం ఉంది
అయితే ఈ మొత్తాన్ని ఈటల రాజేందర్ లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జైలుకు వెళ్లడంతో తన ఉద్యోగం ఊడిందనీ, ఇప్పుడు కూలి పని చేసుకుంటూ జీవితం గడుపుతున్నానని బాధపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున తనకు ప్రాణహాని ఉందనీ, తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.