డాక్టర్ శిల్ప ఆత్మహత్య కేసు.. లైంగిక వేధింపులే కారణమని తేల్చిన సీఐడీ!
- ఆగస్టు 7న ఆత్మహత్య చేసుకున్న శిల్ప
- శిల్ప సోదరి ఫిర్యాదుతో సీఐడీ అధికారుల దర్యాప్తు
- రవికుమార్, శశికుమార్, కిరీటిలపై కేసు నమోదు
ఈ ముగ్గురూ తనను లైంగికంగా వేధిస్తున్నారని.. పోలీసులతో పాటు గవర్నర్‌కు అప్పట్లో శిల్ప ఫిర్యాదు చేశారు. దీనిపై గవర్నర్ కార్యాలయం ఆదేశాల మేరకు ఎస్వీ వైద్య కళాశాల ప్రధానాచార్యులు విచారణ నిర్వహించినప్పటికీ బాధ్యులపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో వేధింపులు ఆగకపోవడంతో మరింత కుంగిపోయిన శిల్ప ఆత్మహత్యకు పాల్పడినట్టు సీఐడీ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. శిల్ప ఆత్మహత్యకు కారణమైన రవికుమార్, శశికుమార్, కిరీటిలపై కేసు నమోదు చేసినట్టు సీఐడీ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు.