వరుసగా రెండో శుక్రవారం సీబీఐ కోర్టుకు జగన్‌ దూరం!

  • అనారోగ్యం కారణంగా హాజరుకాలేకపోతున్నారని తెలిపిన జగన్‌ లాయర్‌
  • శ్రీనివాసరావు అనే వ్యక్తి దాడిలో గాయపడిన వైసీపీ అధినేత
  • డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని కోరడంతో ఇంటికే పరిమితం
అక్రమాస్తుల కేసులో సీబీఐ న్యాయ స్థానానికి ప్రతి శుక్రవారం హాజరుకావాల్సి ఉన్న వైసీపీ అధినేత, విపక్ష నేత జగన్‌ వరుసగా రెండోవారం గైర్హాజరయ్యారు. అనారోగ్యం కారణంగా ఆయన కోర్టుకు హాజరు కాలేకపోతున్నారని జగన్‌ తరపు లాయర్‌ న్యాయమూర్తికి తెలియజేశారు.

గత నెల 25వ తేదీన విశాఖ విమానాశ్రయం లాంజ్‌లో అక్కడి రెస్టారెంట్‌లో పనిచేస్తున్న శ్రీనివాసరావు అనే వ్యక్తి జగన్ పై కత్తితో దాడిచేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో జగన్‌ భుజానికి స్వల్ప గాయమైంది. గాయానికి చికిత్స చేస్తున్న వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో విపక్ష నేత రెండు వారాలుగా ఇంటికే పరిమితమయ్యారు. ఈ కారణంగా గత శుక్రవారం కూడా కోర్టుకు హాజరు కాలేదు.
Go Back to Shorts
Jagan
cbi court

More Telugu News