ఆపిల్ పండ్ల డబ్బాల్లో రూ.200 కోట్ల విలువైన హెరాయిన్.. అవాక్కైన అధికారులు!

ఆపిల్ పండ్ల లోడ్‌తో వస్తున్న లారీని తనిఖీ చేసిన పోలీసులు షాక్‌కు గురయ్యారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, పోలీసు అధికారులు కలసి ఆపిల్ పండ్ల డబ్బాల్లో హెరాయిన్‌ని తరలిస్తున్న స్మగ్లర్ల ముఠా ఆట కట్టించారు. నేటి సాయంత్రం జమ్మూకాశ్మీర్‌లోని కుప్వారా నుంచి ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండికి ఆపిల్ పండ్ల లోడుతో వస్తున్న లారీని అధికారులు పట్టుకున్నారు. లారీ మొత్తం క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు పెద్ద మొత్తంలో హెరాయిన్‌ను కనుగొన్నారు. దీని విలువ రూ.200 కోట్లు ఉంటుందని అంచనా. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ట్రక్కును స్టేషన్‌కు తరలించి.. ముఠాను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
Go Back to Shorts
Apples
Lorry
Police
Kupwara
Ajadpur

More Telugu News