jagapathibabu: లిఫ్ట్ లోనే కన్నీళ్లు పెట్టుకున్నాను .. నన్ను మార్చేసిన సంఘటన అది: జగపతిబాబు

షార్ట్స్‌లో చూడండి
తాజాగా జగపతిబాబు .. ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మనసును కదిలించే ఒక సంఘటనను గురించి ప్రస్తావించారు. "ప్రతి ఒక్కరూ తమకి వచ్చిందే పెద్దకష్టమని చెప్పుకుంటూ వుంటారు. ఇంత కష్టాన్ని ఎలా తట్టుకోవాలా అని డీలాపడిపోతూ వుంటారు. ఒకానొక సమయంలో నా కష్టాల గురించి నేను కూడా ఇలాగే అనుకుంటూ ఉండేవాడిని.

అవి 'మనోహరం' సినిమా షూటింగు జరుగుతున్న రోజులు. ఒకసారి నేను లిఫ్ట్ లో వెళుతుండగా ఒక చంటిపిల్ల తల్లి .. బిడ్డతో పాటు లిఫ్ట్ లోకి వచ్చింది. ఆమె బాధపడుతుండటం చూసి .. 'పాపకి ఏమైందమ్మా' అని అడిగాను. 'కేన్సర్ అండీ .. కొన్ని నెలలు మాత్రమే బతుకుతుందట' అని చెప్పింది. అంతే, నా కళ్ల వెంట నీళ్లు తిరిగాయి. ఆ తల్లికి .. ఆ బిడ్డకి వచ్చిన కష్టం ముందు నా కొచ్చిన కష్టం ఎంత? అనుకున్నాను. వాళ్లతో పోల్చుకుంటే అసలు నాకు ఉన్నవి కష్టాలే కాదనిపించింది. ఆ సంఘటన నా జీవితాన్ని బాగా మార్చేసింది .. ఇతరుల జీవితాల్లోకి చూసినప్పుడే కష్టాలంటే ఎలా వుంటాయో తెలుస్తుందనే విషయం అర్థమైంది" అని చెప్పుకొచ్చారు.      
Go Back to Shorts
jagapathibabu

More Telugu News