jagapathibabu: సౌందర్యతో ఫ్రెండ్షిప్ మాత్రమే ఉండేది: జగపతిబాబు

షార్ట్స్‌లో చూడండి
జగపతిబాబు .. సౌందర్య కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారనీ .. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారనే వార్తలు గతంలో షికారు చేశాయి. ఆ ప్రచారం గురించిన ప్రస్తావన ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో వచ్చింది. అప్పుడు జగపతిబాబు స్పందిస్తూ .. "నాకు పరిచయమైన వాళ్లతో నేను క్లోజ్ గానే వుంటాను. అలా ఉండటం వలన వాళ్ళేం అనుకుంటారో .. వీళ్ళేం అనుకుంటారోనని ఆలోచించే రకం కాదు నేను.

 ఎవడేమనుకుంటే మనకేంటి .. పనిలేనివాళ్లు ఎంటర్టైన్ మెంట్ కోసం ఎన్నో అనుకుంటారు. ఎవరెవరు ఏం చేస్తున్నారన్నది నేను పట్టించుకోను. అలాగే నాకు సంబంధించిన విషయాలు ఇతరులకి అనవసరం అనుకుంటాను. సౌందర్య వాళ్లది చాలా సంప్రదాయబద్ధమైన కుటుంబం. సౌందర్య .. ఆమె బ్రదర్ అమర్ నాకు ఫ్రెండ్స్. నేను వాళ్ల ఇంటికి వెళుతూ ఉండేవాడిని. ఒకసారి నేను కోదండరామిరెడ్డి గారిని రిసీవ్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్ కి వెళితే సౌందర్య దిగింది. దాంతో ఆమె కోసం స్టేషన్ కి వచ్చినట్టు రాశారు. ఇలా అనుకోకుండా జరిగిన  కొన్ని సంఘటనల వలన అలా ప్రచారం జరిగిందంతే" అని చెప్పుకొచ్చారు.   
Go Back to Shorts
jagapathibabu

More Telugu News