నేను క్షేమంగానే వున్నాను: హైపర్ ఆది
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను క్షేమంగానే వున్నాను: హైపర్ ఆది

  • నాకు ఎలాంటి ప్రమాదం జరగలేదు 
  • వ్యూస్ కోసం కొంతమంది ఇలా చేస్తున్నారు
  • ఇది అసత్య ప్రచారం .. నమ్మకండి    
'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్న నటుడిగా హైపర్ ఆది కనిపిస్తాడు. పంచ్ డైలాగ్స్ తో కితకితలు పెట్టే హైపర్ ఆదికి యూత్ లో మంచి క్రేజ్ వుంది. ఆయన స్కిట్ కోసమే 'జబర్దస్త్' కామెడీ షోను ఫాలో అయ్యేవాళ్లు లేకపోలేదు. అయితే రెండు వారాలుగా 'జబర్దస్త్' కామెడీ షో వేదికపై హైపర్ ఆది కనిపించడం లేదు.

దాంతో రీ సేంట్ గా అమెరికా వెళ్లిన ఆయన రోడ్డు ప్రమాదానికి గురయ్యాడనీ, పరిస్థితి విషమంగానే ఉందనే వార్తలు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో కనిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై హైపర్ ఆది స్పందిస్తూ .. "కొన్ని చెత్త యూట్యూబ్ చానల్స్ వ్యూస్ కోసం నాకు ఏదో ప్రమాదం జరిగినట్టుగా అసత్య ప్రచారం చేస్తున్నాయి. అలాంటి వార్తలను ఎవరూ నమ్మకండి .. నేను క్షేమంగానే వున్నాను" అంటూ, జోరుగా జరుగుతోన్న అసత్య ప్రచారాలకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు.     
hyper aadi

More Telugu News