దేశం విడిచి పారిపోయిన గాలి జనార్దన్ రెడ్డి?
- గాలి కోసం వెతుకుతున్న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు
- ఈడీ అధికారికి రూ. కోటి ఇచ్చినట్టు ఆరోపణ
- రెండు రోజులు గడిచినా లభించని గాలి ఆచూకీ
దీంతో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విస్తృత తనిఖీలు ప్రారంభించి, రెండు రోజులు గడిచినా, గాలి ఆచూకీ విషయమై ఒక్క వివరమూ సేకరించలేకపోయారు. తమ నేత ఎక్కడున్నారన్న విషయాన్ని ఆయన అనుచరులు, కుటుంబీకులు కూడా చెప్పడం లేదు. దీంతో ఆయన విజయ్ మాల్యా మాదిరిగా దేశం విడిచి వెళ్లి ఉండవచ్చని కొందరు పోలీసులు అనుమానిస్తున్నారు. గత మూడు నాలుగు రోజుల వ్యవధిలో విదేశాలకు వెళ్లిన వారి వివరాలను పరిశీలిస్తున్నారు.