Telugudesam: మహాకూటమిని చూసి టీఆర్‌ఎస్‌ వణుకుతోంది: టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ

షార్ట్స్‌లో చూడండి
ముందస్తు ఎన్నికల్లో మహాకూటమి విజయఢంకా మోగించడం ఖాయమని, కూటమి జోరు చూసి టీఆర్‌ఎస్‌ వణుకుతోందని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ అన్నారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డిలు ఈరోజు అమరావతిలో కలవనున్నారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ మహాకూటమి ఏర్పాటులో తెలుగుదేశం పార్టీ క్రియాశీలక పాత్ర పోషించిందన్నారు. భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లోనూ చంద్రబాబు కీలకపాత్ర పోషిస్తారని చెప్పారు.

తెలంగాణలో పార్టీ కోసం తామెలా పనిచేస్తున్నామో, దేశ ప్రయోజనాల కోసం చంద్రబాబు అంతకంటే ఎక్కువ కష్టపడుతున్నారని చెప్పారు. ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తామని, ఆ కమిటీయే పోటీ చేయబోయే అభ్యర్థులను ఎంపిక చేస్తుందని తెలిపారు. రావుల మాట్లాడుతూ సీట్లు, పదవుల యావ తమకు లేదని, ఆ యావ ఉన్న వారు ఇప్పటికే పార్టీని వదిలి వెళ్లిపోయారని చెప్పారు.
Go Back to Shorts
Telugudesam
l.ramana
mahakutami

More Telugu News