వివాహితతో అక్రమ సంబంధం నడుపుతూ అడ్డంగా దొరికిపోయిన గన్ మెన్... సస్పెన్షన్!

  • అదనపు డీసీపీ వద్ద గన్ మెన్ గా రమేష్
  • గన్ తో సహా యువతితో ఉండగా చూసిన ఆమె భర్త
  • దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగింత
ఓ యువతితో వివాహేతర సంబంధాన్ని నడుపుతున్న అడిషనల్ డీసీపీ గన్ మెన్ చాకలి రమేష్ (26), యువతి భర్తకు అడ్డంగా దొరికిపోవడంతో, రాచకొండ కమిషనర్ అతన్ని సస్పెండ్ చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, రమేష్, తన గ్రామానికి చెందిన ఓ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.

గత సోమవారం నాడు విధుల్లో ఉన్న రమేష్, తన సర్వీస్ రివాల్వర్ తో సహా ఆమె ఇంటికి వెళ్లిన సమయంలో, భర్త రాజు ఇంటికి వచ్చాడు. తన భార్యను, ఆమెతో ఉన్న రమేష్ ను చూసిన అతను, తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయగా, తన చేతిలోని పిస్టల్ ను చూపిస్తూ, బెదిరింపులకు దిగాడు రమేష్. దీంతో రాజు కేకలు వేయగా, చుట్టుపక్కల ఉన్నవారు వచ్చి, రమేష్ కు దేహశుద్ధి చేశారు.

తనను హత్య చేసేందుకు రమేష్ ప్రయత్నించాడని, మోయినాబాద్ పోలీసులకు రాజు ఫిర్యాదు చేయడంతో, కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ విషయం తెలియడంతో అతన్ని సస్పెండ్ చేస్తున్నట్టు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఉత్తర్వులు వెలువరించారు.
Go Back to Shorts
Rachakonda
Police
Hyderabad
Suspend
Gunmen

More Telugu News