బీజేపీ కంచుకోట బద్దలు.. బళ్లారిలో దాదాపు రెండున్నర లక్షల ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ ఘన విజయం
- బళ్లారిలో 2,43,161 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి ఘన విజయం
- మండ్యలో 3 లక్షలకు పైగా మెజార్టీతో జేడీఎస్ జయకేతనం
- ఐదు స్థానాల్లో నాలుగు చోట్ల బీజేపీ ఓటమి
ఇక శివమొగ్గ పార్లమెంటు స్థానంలో మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర 52,148 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రామనగరం, జామ్ ఖండి అసెంబ్లీ స్థానాలను కూడా కాంగ్రెస్-జేడీఎస్ కూటమి కైవసం చేసుకుంది. మొత్తం మీద 5 స్థానాలకు జరిగిన ఉపఎన్నికలలో... కూటమి నాలుగు స్థానాల్లో విజయదుందుభి మోగించగా... బీజేపీ కేవలం ఒక్క స్థానంలో మాత్రమే గెలిచింది. ఈ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్-జేడీఎస్ శ్రేణుల్లో పండుగ వాతావరణం నెలకొంది.