ఓటుకు నోటు కేసులో చంద్రబాబు తప్పించుకోలేరు!: వైసీపీ నేత రోజా
- పక్కా ఆడియో, వీడియో సాక్ష్యాలతో దొరికిపోయారు
- ఎయిర్ పోర్టులో రెస్టారెంట్ టీడీపీ నేతదే
- కత్తిని జనవరి నుంచి దాచిపెట్టారు
ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై కోడి కత్తి దాడి ఘటనలో సీఎం చంద్రబాబే తొలి ముద్దాయని రోజా ఆరోపించారు. విశాఖపట్నం విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ఫ్యూజన్ రెస్టారెంట్ ను నడుపుతున్నది టీడీపీ నాయకుడేనని రోజా గుర్తుచేశారు. కత్తిని జనవరి నుంచి రెస్టారెంట్ లో దాచిపెట్టడం, దాడి జరిగిన రెండు గంటల్లో ఏడాది క్రితం నాటి పోస్టర్లు మార్ఫింగ్ తో బయటకు రావడం చూస్తుంటే ఇందులో కుట్ర కోణం ఉందని అనుమానం కలుగుతోందన్నారు.