ముగింపు దశలో అల్లు శిరీశ్ మూవీ
- అల్లు శిరీశ్ హీరోగా 'ఏబీసీడీ'
- డిసెంబర్ 15తో షూటింగ్ పూర్తి
- ఫిబ్రవరి 8వ తేదీన విడుదల
ఈ సినిమాలో శిరీశ్ స్నేహితుడిగా భరత్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. అమెరికాలో చివరి షెడ్యూల్ ను ప్లాన్ చేశారట. డిసెంబర్ 15వ తేదీ నాటికి ఈ సినిమా షూటింగును పూర్తిచేయనున్నామనీ, ఫిబ్రవరి 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. కొంత కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తోన్న శిరీశ్ కి, ఈ సినిమాతోనైనా హిట్ పడుతుందేమో చూడాలి.