పందిపిల్ల సినిమాకు అతిథులను పిలిస్తే అసహ్యంగా ఉంటుందని పాదయాత్ర: రవిబాబు
- పందిపిల్లతో పాదయాత్ర చేసిన ‘అదుగో’ చిత్రబృందం
- కేబీఆర్ పార్క్ నుంచి ఫిలిం ఛాంబర్ వరకూ పాదయాత్ర
- తమ కష్టాన్ని చూసైనా చిత్రాన్ని ఆదరించాలన్న రవిబాబు
అయితే అవసరమొచ్చినప్పుడే ఇలాంటి ఐడియాలు వస్తాయని రవిబాబు మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్ చేద్దామనుకున్నామని, కానీ పందిపిల్ల సినిమాకు అతిథులను పిలిస్తే అసహ్యంగా ఉంటుందని విరమించుకున్నామన్నారు. ప్రమోషన్ చేసేందుకు సరిపడా బడ్జెట్ కూడా లేకపోవడంతో ఈ పాదయాత్ర ఐడియా వచ్చిందని తెలిపారు.
తన సినిమాకు సూపర్ స్టార్ బంటియేనని తెలిపారు. 100 రోజులపాటు బంటి షూటింగ్లో పాల్గొన్నట్టు రవిబాబు వివరించారు. తాము మూడేళ్ల పాటు పడిన కష్టాన్ని చూసైనా చిత్రాన్ని ఆదరించాలని రవిబాబు కోరారు. దీపావళికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.