KTR: మాజీ మంత్రి వినోద్‌కు టీఆర్‌ఎస్‌ బుజ్జగింపు.. ఎమ్మెల్సీ పదవి ఎర!

షార్ట్స్‌లో చూడండి
పార్టీ వీడేందుకు దాదాపు రంగం సిద్ధం చేసుకున్నారని భావించిన నేపథ్యంలో మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ నేత వినోద్‌ను బుజ్జగించేందుకు కేటీఆర్‌ రంగంలోకి దిగారు. శాసన సభ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపిస్తున్న వినోద్‌ ఆ అవకాశం లేదని తెలియడంతో కాంగ్రెస్‌ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారన్న వార్తలు మొదలయ్యాయి.

దీంతో శుక్రవారం వినోద్‌ను పిలిపించిన మంత్రి కేటీఆర్‌ ఆయనతో చాలాసేపు మంతనాలు జరిపారు. పార్టీ వీడొద్దని, అధికారం సాధించాక ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని చెప్పి బుజ్జగించినట్లు సమాచారం. అయితే తనకు ఎమ్మెల్యేగానే పోటీ చేయాలన్న ఆసక్తి ఉందని, చెన్నూరు నుంచి బరిలో దిగనున్నానని ఈ సందర్భంగా వినోద్‌ కేటీఆర్‌ తో చెప్పినట్టు సమాచారం.  
Go Back to Shorts
KTR
VINOD
discussions

More Telugu News