జగన్ పై హత్యాయత్నం కేసు విచారణలో సిట్ తేల్చిందిదే!
- రేపటితో ముగియనున్న శ్రీనివాసరావు కస్టడీ
- ఘటన వెనుక ఎటువంటి కుట్రా లేదు
- సంచలనం కోసం శ్రీనివాస్ చేసిన పనే
వైకాపా నేతలు సానుభూతి కోసం చేయించలేదని, ఇది సంచలనం కోసం శ్రీనివాస్ చేసిన పనేనని పేర్కొన్నట్టు సమాచారం. అదే కత్తి గొంతులో దిగివుంటే ప్రాణహాని జరిగివుండేదని చెబుతూ, నిందితుడి టార్గెట్ అది కాదని, అతని మానసిక స్థితి బాగాలేదని, ఒక్కోసారి సైకోలా ప్రవర్తిస్తున్నాడని తెలిపినట్టు పోలీసు వర్గాలు అంటున్నాయి. ఈ కేసు వెనుక ఎలాంటి కుట్రా లేదని పేర్కొన్నట్టుగా సమాచారం. ఇదే రిపోర్టును సిట్ అందించనున్నట్టు తెలుస్తోంది.