కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ వివాదం నేపథ్యంలో ఆర్థికశాఖ కీలక ప్రకటన!
- ఆర్‌బీఐతో కేంద్రం రాజీ
- ఆర్‌బీఐ స్వతంత్రతను కేంద్ర గౌరవిస్తోంది
- ఆర్‌బీఐ, కేంద్రం మధ్య విస్తృత సంప్రదింపులు
అయితే కేంద్రప్రభుత్వం ఎప్పటికప్పుడూ సంప్రదింపులను బహిర్గతం చేయలేదని, కేవలం తుది నిర్ణయాలను మాత్రమే ప్రకటించగలుగుతామని వెల్లడించింది. ఈ సంప్రదింపుల ద్వారా సమస్యలను కేంద్ర ప్రభుత్వం అంచనా వేసి, సాధ్యమైన పరిష్కారాలను సూచిస్తూ ఉంటుందని, ఇక మీదట కూడా కేంద్రం ఇలాగే చేస్తుందని ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్ధిక శాఖ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం నేపథ్యంలో విశేషాధికారాలను ఉపయోగించి ఆర్‌బీఐకి మార్గదర్శకాలు జారీ చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు మొదట వార్తలు వచ్చాయి. అయితే ఈ పరిణామంతో ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం రాజీ ధోరణిలో వ్యవహరించనున్నాయి.