mammootty: వైఎస్ 'యాత్ర' బయోపిక్ అప్డేట్

  • షూటింగు పూర్తి చేసుకున్న 'యాత్ర'
  • తన పాత్రకి డబ్బింగ్ చెప్పిన మమ్ముట్టి 
  • డిసెంబర్ 21వ తేదీన విడుదల    

ఒక వైపున ఎన్టీఆర్ బయోపిక్ రూపొందుతుంటే, మరో వైపున వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ నిర్మితమవుతోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి  రాజకీయ జీవితాన్ని ఆయన చేసిన పాదయాత్ర మలుపు తిప్పింది. ఆ పాదయాత్రను ప్రధానంగా చేసుకునే 'యాత్ర' బయోపిక్ రూపొందుతోంది. వైఎస్ గా మమ్ముట్టి నటిస్తోన్న ఈ సినిమాకి మహి. వి రాఘవ్ దర్శకత్వం వహించాడు.

తాజాగా ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకుని, నిర్మాణానంతర పనులను పూర్తిచేసుకుంటోంది. మమ్ముట్టి తెలుగులోను తన పాత్రలకి తానే డబ్బింగ్ చెప్పుకుంటూ వుంటారు. అలాగే ఆయన ఈ సినిమాలో కూడా తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. జగపతిబాబు .. సుహాసిని .. రావు రమేష్ .. అనసూయ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషించారు. డిసెంబర్ 21వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

More Telugu News