బీజేపీ అధికారంలో ఉంటే న్యాయం జరుగుతుందనే ఇదంతా చేశాం: సీఎం రమేష్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బీజేపీ అధికారంలో ఉంటే న్యాయం జరుగుతుందనే ఇదంతా చేశాం: సీఎం రమేష్

  • విభజన సమయంలో బీజేపీ మాటలను నమ్మాం
  • ఏపీని అభివృద్ధి చేస్తారని భావించాం
  • అందుకే బీజేపీని భుజాన ఎత్తుకున్నాం
బీజేపీ అధికారంలో ఉంటే ఏపీకి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే నాడు ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నామని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. మంగళవారం కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో జరిగిన ధర్మపోరాట సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎప్పుడైతే మన ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిందో ఆ సమయంలో రాజ్యసభలో ‘ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరుగుతోంది. 10 సంవత్సరాలు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ బిల్లులో ఇవన్నీ పెట్టాలి. అలా చేస్తేనే ఏపీకి న్యాయం జరుగుతుంది’ అని నాడు బీజేపీ నాయకులు చెబితే వీరేదో మన ఏపీకి న్యాయం చేస్తారని ఆ తదుపరి వచ్చిన ఎన్నికల్లో బీజేపీతో కలిశామని అన్నారు .

ఎన్నికల ప్రచారానికి వచ్చినపుడు నరేంద్రమోదీ తిరుపతి, నెల్లూరు, గుంటూరు, వైజాగ్‌ల్లో ‘చంద్రబాబుతో కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపిస్తాం. మీకు స్కామాంధ్రప్రదేశ్ కావాలా? స్కీములొచ్చే ఆంధ్రప్రదేశ్ కావాలా’ అని మాట్లాడారు. అనంతరం మోదీ ఏం చేశారు? ఆ సమయంలో చంద్రబాబు గారు పోలవరం ముంపు మండలాలు ఏడు మాకు ఇవ్వకుంటే నేను ప్రమాణ స్వీకారం కూడా చేయను అంటే వెంటనే ఆ బిల్లు తీసుకొచ్చి చట్టం చేశారు. దీంతో మన ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేస్తారని వీరిని భుజాన ఎత్తుకున్నాం. పార్లమెంటులో బీజేపీ పెట్టిన ప్రతి బిల్లూ పాస్ చేసుకుంటూ వచ్చాం. బీజేపీ అధికారంలో ఉంటే ఏపీకి న్యాయం జరుగుతుందనే ఇదంతా చేశాం అని తెలిపారు.
CM Ramesh
Chandrababu
Narendra Modi
BJP
Andhra Pradesh

More Telugu News