తెలంగాణ సీనియర్ నేత మోత్కుపల్లిపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి.. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన నేత!
- యాదాద్రి జిల్లాలోని మల్లాపురంలో ఘటన
- దాడికి పాల్పడ్డ కాంగ్రెస్ నేత భిక్షమయ్యగౌడ్ వర్గీయులు
- బీఎల్ఎఫ్ టికెట్ పై మోత్కుపల్లి పోటీ
ఈ ఘటన జిల్లాలోని యాదగిరిగుట్ట మండలం మల్లాపురంలో ఈ రోజు చోటుచేసుకుంది. డిసెంబర్ 7న జరగనున్న ఎన్నికల్లో ఆలేరులో పోటీ చేసేందుకు మోత్కుపల్లి ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్(బీఎల్ఎఫ్) పార్టీ ఇటీవల విడుదల చేసిన రెండో జాబితాలో మోత్కుపల్లి పేరును చేర్చింది. ఈ నేపథ్యంలో ఆయన ఆలేరులో బీఎల్ఎఫ్ టికెట్ పై పోటీ చేయడం ఖరారైపోయింది. ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ ప్రచారంలో ఎదురుపడటంతో మోత్కుపల్లి వర్గీయులపై భిక్షమయ్యగౌడ్ వర్గీయులు దాడిచేశారు.