జగన్ పై హత్యాయత్నానికి ముఖ్యమంత్రి చంద్రబాబే బాధ్యత వహించాలి!: మాజీ మంత్రి కొప్పన
- చంద్రబాబు, డీజీపీ ప్రవర్తన దారుణం
- ఏం మాట్లాడుతున్నారో బాబుకే తెలియడం లేదు
- వాస్తవాలు దాచేందుకు యత్నిస్తున్నారు
రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఈ దాడి ఘటనలో వాస్తవాలను మరుగున పర్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జగన్ పై హత్యాయత్నం ఘటనపై నిష్పాక్షిక విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పిఠాపురం ఎమ్మెల్యే వర్మ గొల్లప్రోలు నగరపంచాయతీ శానిటరీ ఇన్‌స్పెక్టర్ శివలక్ష్మి చేతులతో డ్రైనేజీ పూడిక తీయించడం దారుణమన్నారు. మహిళా ఉద్యోగిని అవమానించిన ఎమ్మెల్యే వర్మపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.