Boxing: కుల్ఫీ ఐస్‌క్రీం అమ్ముకుని జీవిస్తున్న అర్జున అవార్డు గ్రహీత, బాక్సర్ దినేశ్ కుమార్

  • దేశ కీర్తిపతాకను అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడించిన దినేశ్ కుమార్
  • దయనీయంగా మారిన జీవితం.. పట్టించుకోని ప్రభుత్వం
  • బతుకు దెరువు కోసం ఐస్‌క్రీములు అమ్ముకుంటున్న ప్రముఖ బాక్సర్

బాక్సింగ్‌లో దేశ కీర్తిపతాకను అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడించిన బాక్సర్ దినేశ్ కుమార్ ఇప్పుడు దయనీయ పరిస్థితిలో ఉన్నాడు. బతుకు దెరువు కోసం కుల్ఫీ ఐస్‌క్రీములు అమ్ముకుంటూ జీవిస్తున్నాడు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు పతకాలు అందుకున్న బాక్సర్‌కు ప్రభుత్వం అర్జున అవార్డు ఇచ్చి సత్కరించింది కూడా.

దినేశ్ కుమార్ ఓ ప్రమాదంలో గాయపడడంతో చికిత్స కోసం అతడి తండ్రి డబ్బులు అప్పు చేశాడు. కొడుకును అంతర్జాతీయ పోటీలకు పంపేందుకు అప్పటికే బోల్డన్ని అప్పులు చేసిన ఆయనకు ఇది మరింత భారమైంది. తండ్రి పడుతున్న కష్టాలను గమనించిన దినేశ్ కుమార్ కుల్ఫీలు అమ్ముతూ తండ్రికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నాడు. అప్పుగా తెచ్చిన డబ్బులకు వడ్డీ కడుతూ జీవితాన్ని లాక్కొస్తున్నాడు. దినేశ్ కుమార్ తన కెరీర్‌లో 17 స్వర్ణ పతకాలు, ఓ రజతం, 5 కాంస్య పతకాలు సాధించాడు.

ప్రభుత్వం నుంచి తనకు ఎటువంటి సాయం అందకపోవడం వల్లే తాను తండ్రితో కలిసి ఐస్ క్రీం అమ్ముకుంటున్నట్టు దినేశ్ చెప్పుకొచ్చాడు. ప్రభుత్వం తనకో ఉద్యోగం ఇవ్వాలని కోరాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆడే ఆటగాళ్లకు తాను శిక్షణ ఇవ్వగలనని పేర్కొన్నాడు.

More Telugu News