'మణికర్ణిక' కోసం అత్యధిక పారితోషికం తీసుకున్న కంగనా
- 'మణికర్ణిక'గా కంగనా రనౌత్
- భారీ బడ్జెట్ తో జరుగుతోన్న నిర్మాణం
- వచ్చే ఏడాది జనవరి 25న సినిమా రిలీజ్
ఈ సినిమా కోసం ఆమె తీసుకున్న పారితోషికం 14 కోట్లు అని చెబుతున్నారు. శ్రీదేవి .. ఐశ్వర్య రాయ్ .. కరీనా కపూర్ .. ప్రియాంక చోప్రా .. దీపికా పదుకొనే .. కత్రినా వీళ్లంతా కూడా కొంతకాలం పాటు నెంబర్ వన్ స్థానంలో కొనసాగారు. వీళ్లందరూ కూడా ఒకరి తరువాత ఒకరుగా తమ క్రేజ్ కి తగినట్టుగానే పారితోషికం తీసుకుంటూ వచ్చారు.
అయితే తొలిసారిగా 14 కోట్లు పారితోషికంగా తీసుకున్నది మాత్రం కంగనాయేనని అంటున్నారు. 'మణికర్ణిక' చారిత్రక చిత్రం కావడం వలన ఎక్కువ రోజులు కేటాయించవలసి ఉంటుంది. అలాగే ఎక్కువ రిస్క్ తీసుకోవలసి ఉంటుంది. అందువల్లనే కంగనాకు ఆ స్థాయి పారితోషికం ముట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.