హాలీవుడ్ స్టార్ రాబర్ట్ నీరోను కలవడంతో ఉప్పొంగిన బాలీవుడ్ దిగ్గజం రిషీ కపూర్!
- అద్భుతమైన క్షణమని రిషీ కపూర్ ట్వీట్
- ఆయనని చూస్తే నేను ఎంత చెడుగా పెరిగానో తెలుస్తోంది
- వైద్యపరీక్షల కోసం భార్య, కొడుకుతో కలిసి అమెరికా వెళ్లిన రిషీ
రణ్ బీర్ కపూర్, రాబర్ట్ డీ నీరోతో కలిసి దిగిన సెల్ఫీని ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. న్యూయార్క్ లో అనూహ్యంగా రాబర్ట్ నీరోను కలవడం అద్భుతమైన క్షణమని పేర్కొన్నారు. అనుపమ్ ఖేర్ తో వచ్చిన రాబర్ట్ డీ నీరోను రణ్ బీర్ కపూర్ ఇదివరకే కలిశారు. అందుకే రాబర్ట్ కు రణ్ బీర్ కపూర్ తెలుసన్నారు. నిరాడంబరత, సూపర్ స్టార్ డమ్ రాబర్ట్ సొంతమని, ఆయనను చూస్తే తాను ఎంత చెడుగా పెరిగానో అర్థమవుతుందన్నారు.