sharuk khan: 'నా ఆఫీస్ సంగతేంటి?' అన్న షారుక్.. 'టైం ఉన్నప్పుడు చూద్దాం' అంటూ జవాబిచ్చిన భార్య!

షార్ట్స్‌లో చూడండి
దంపతుల మధ్య పరస్పర అవగాహన వుంటే వయసు పెరుగుతున్నా వారి సంసారం నిత్య నూతనంగానే వుంటుంది. సరదా సరదా జోకులతో జీవితాన్ని హ్యాపీగా లాగించేస్తుంటారు. బాలీవుడ్ హీరో షారుక్, గౌరీల జంట కూడా అలాంటిదే. తాజాగా వీరిద్దరూ సరదాగా చేసుకున్న ఇన్‌స్టాగ్రామ్‌ సంభాషణలు వైరల్‌ అవుతుండడం ఇందుకు ఓ ఉదాహరణ.

అసలు విషయం ఏమిటంటే...షారూక్‌ భార్య గౌరి ముంబైలోని టాప్‌ ఇంటీరియర్‌ డిజైనర్స్‌లో ఒకరు. నగరంలో ‘గౌరీఖాన్‌ డిజైన్స్‌‘ పేరుతో ఆమె ఓ షోరూం కూడా ప్రారంభించారు. ఆమె డిజైన్లకు మంచి డిమాండ్‌ ఉంది. ఓ ప్రముఖ కాస్మెటిక్‌ కంపెనీ కోసం గౌరీ ఇటీవల ముంబయిలో ఓ స్టూడియో డిజైన్‌ చేశారు. ఈ స్టూడియో ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. 'బాలిగ్లో సంస్థ కోసం డిజైన్‌ చేసిన స్టూడియో ఇది. ఇటలీ, కొరియాకు చెందిన కాస్మెటిక్స్‌ ఇక్కడ కొనగలిగే ధరల్లోనే లభ్యమవుతున్నాయి’ అని పొటో కింద రాశారు.

ఈ పోస్టుపై స్పందించిన షారూక్‌ ‘బాలిగ్లో స్టూడియో సరే...మరి నా కార్యాలయం డిజైన్‌ ఎప్పుడు?’ అంటూ కామెంట్‌ చేశారు. దీనిపై ‘నాకు సమయం ఉన్నప్పుడు’ అని గౌరీ స్పందించారు. ఈ సంభాషణే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మీ కార్యాలయాన్ని కూడా డిజైన్‌ చేయలేనంత బిజీగా మీ భార్య ఉన్నారా? అంటూ నెటిజన్లు ఛలోక్తులు విరుసురుతున్నారు. 1991లో ఒక్కటైన షారూక్‌, గౌరీ పెళ్లి రోజు అక్టోబరు 25.. అంటే నేడే!
Go Back to Shorts
sharuk khan
gouri
mumbai

More Telugu News