westindies: సెంచరీకి చేరువలో అవుటైన హెట్ మయర్.. విండీస్ 32 ఓవర్లలో 221

షార్ట్స్‌లో చూడండి
విశాఖ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో భారీ విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ జట్టు ఇప్పటికే నాలుగు వికెట్లు కోల్పోయింది. కేవోఏ పావెల్ (18), హేమ్ రాజ్ (32), శామ్యూల్స్ (13), హెట్ మయర్ (94) వికెట్లను విండీస్ జట్టు కోల్పోయింది. క్రీజ్ లో హోప్, ఆర్. పావెల్ కొనసాగుతున్నారు.

32 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయిన విండీస్ జట్టు స్కోరు 221 పరుగులు చేసింది. కాగా, హెట్ మయర్ మరో ఆరు పరుగులు చేస్తే సెంచరీ కొడతాడనగా చాహల్ బౌలింగ్ లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి దొరికిపోయాడు. భారత్ బౌలర్లు షమీ, చాహల్ చెరో వికెట్ తీసుకోగా, కులదీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు.
Go Back to Shorts
westindies
bharat
Vizag

More Telugu News