రేవంత్ కు భద్రత విషయమై కేంద్రాన్ని, ఈసీని ప్రశ్నించిన హైకోర్టు
- రేవంత్ కు భద్రత దరఖాస్తును పట్టించుకోని కేంద్రం, ఈసీ
- హైకోర్టును ఆశ్రయించిన రేవంత్
- సంబంధిత వివరాలను అందించాలని కేంద్రం, ఈసీకి ఆదేశం
పిటిషనర్ కు భద్రత కల్పించాల్సిన బాధ్యత ఎవరిదంటూ కేంద్ర హోం శాఖను, ఈసీని ప్రశ్నించింది. అందుకు సంబంధించిన వివరాలు అందించాలని కేంద్రం, ఈసీ తరపు న్యాయవాదులను ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. కాగా, తనకు రాజకీయ ప్రత్యర్థులు, సంఘ విద్రోహ శక్తులతో ప్రమాదం పొంచి ఉన్నందున నలుగురు సిబ్బందితో తనకు భద్రత కల్పించాలని రేవంత్ తన దరఖాస్తులో కోరారు.