పవన్ కల్యాణ్ గారు ఏమంటారోనని టెన్షన్ పడ్డాను: 'అరుంధతి' అరవింద్
- పవన్ గారితో కలిసి 'అన్నవరం' చేశాను
- ఆయనకి నన్ను భీమనేని పరిచయం చేశారు
- పవన్ ఎంతో ఆత్మీయంగా మాట్లాడతారు
మా ఫాదర్ విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ లో పనిచేస్తున్నారు. నెలకి రెండు రోజులపాటు ఆయనకి వెహికల్స్ ను చెక్ చేసే పని పడేది. ఓ రోజు రాత్రి ఆయన లింగంపల్లి దగ్గర వెహికల్స్ ను చెక్ చేస్తున్నారు. 'అన్నవరం' షూటింగుకి వస్తోన్న పవన్ గారి కారును ఆపేసి .. ఆ తరువాత పంపించివేసినట్టుగా మా నాన్న నాకు ఫోన్ చేసి చెప్పారు. అరవింద్ మా అబ్బాయేనని పవన్ కి చెప్పానని కూడా అన్నారు. పవన్ సెట్ కి వచ్చేసరికి నాకు టెన్షన్ .. ఏమంటారోనని. 'అరవింద్ గారు .. మీ ఫాదర్ నా కారు ఆపేశారు' అంటూ ఆయన సరదాగా మాట్లాడేసరికి 'హమ్మయ్య' అనుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.