పశుపతి పాత్ర కోసం ముందుగా నన్ను అనుకున్నారు: 'అరుంధతి' అరవింద్
- పశుపతి పాత్ర సోనూ సూద్ కి వెళ్లింది
- మరుసటి రోజు కోడి రామకృష్ణగారిని కలిశాను
- అందువలన అదే మూవీలో మరో పాత్ర వచ్చింది
తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. 'అరుంధతి' సినిమాలో ముందుగా నాకు 'పశుపతి' పాత్రను ఇచ్చారు. ఆ తరువాత ఆ పాత్రకి సోనూ సూద్ ను తీసుకున్నారు. అయ్యో మంచి ఛాన్స్ పోయిందేనని ఫీల్ అయ్యాను. అలా అని చెప్పేసి బాధపడుతూ కూర్చోలేదు .. అన్నపూర్ణ స్టూడియోలో ఆ సినిమా షూటింగ్ జరుగుతుంటే వెళ్లి కోడి రామకృష్ణగారిని కలిశాను. 'పశుపతి' పాత్రకి సోనూసూద్ కరెక్ట్ అని చెప్పాను. ఆ మరుసటి రోజు కోడి రామకృష్ణగారు కబురుచేసి, 'అరుంధతి'లో ముందుగా కోటలోకి ప్రవేశించే యువకుడి పాత్రను ఇచ్చారు. అది కూడా నన్ను అంతా గుర్తుపెట్టుకునేలా చేసింది' అని చెప్పుకొచ్చాడు.