మంచినీళ్లు ఇచ్చిన సర్వర్ కు ఏకంగా రూ. 7.38 లక్షల టిప్!
- నార్త్ కరోలినాలో ఘటన
- నీళ్లిచ్చినందుకు అలియానా కస్టర్ కు భారీ టిప్
- ఆనందంతో ఎగిరి గంతులేస్తున్న యువతి
మరిన్ని వివరాల్లోకి వెళితే, ఓ హోటల్ లో అలియానా కస్టర్ అనే యువతి వెయిట్రెస్ గా పనిచేస్తోంది. ఆ హోటల్ కు వచ్చిన ఓ కస్టమర్ మంచినీరు కావాలని కోరగా, ఆమె నీరిచ్చింది. అవి తాగిన అతను మరో గ్లాస్ కావాలని అనడంతో, అంతే వినమ్రంగా మరో గ్లాస్ నీటిని ఇచ్చింది. ఆపై హోటల్ నుంచి వెళ్లిపోయిన అతను, "రుచికరమైన నీళ్లు ఇచ్చినందుకు కృతఙ్ఞతలు" అని ఓ కాగితంపై రాసి, టిప్ ను అక్కడ పెట్టి వెళ్లాడు. దాన్ని చూసిన ఆమె సంభ్రమాశ్చర్యాల్లో పడి, తేరుకోకముందే, మరోసారి వచ్చిన అతను, ఆమెకు ఓ హగ్ ఇచ్చి వెళ్లాడు.
ఇక ఆ కస్టమర్ యూట్యూబ్ లో దాదాపు 90 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న మిస్టర్ బీస్ట్ అని తెలుసుకున్న అలియానా, ఇప్పుడు ఆనందంలో ఎగిరి గంతేస్తోంది. ఈ రోజును తన జీవితంలో మరచిపోలేనని చెబుతోంది. తనతో పాటు పనిచేస్తూ, చదువుకునే స్తోమతలేని వారికి సాయం చేసేందుకు డబ్బును వినియోగిస్తానని చెబుతోంది.