కాంగ్రెస్ గెలిచే స్థానాలను మాత్రం అడక్కండి!: 'కూటమి' మిత్రులకు విజయశాంతి సూచన
- గెలిచేందుకు స్థానాలు అడగాలి
- కేసీఆర్‌కు 104 జ్వరం రావడం ఖాయం
- కేసీఆర్‌పై వ్యంగ్యాస్త్రాలు
కాంగ్రెస్ ప్రచారంలో దూసుకుపోతున్న విజయశాంతి నేడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు 100 సీట్లు రావడం కాదని.. ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్‌కు 104 జ్వరం రావడం ఖాయమని వ్యంగ్యంగా పేర్కొన్నారు. ఈ మేరకు విజయశాంతి ఒక ప్రకటన విడుదల చేశారు.