Chandrababu: చంద్రబాబును కలిసి రూ. 25 లక్షల చెక్కును అందించిన బాలయ్య

షార్ట్స్‌లో చూడండి
తిత్లీ తుపాను బాధితుల సహాయార్థం హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో బాలకృష్ణ రూ. 25 లక్షల ఆర్థికసాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈరోజు చంద్రబాబు హైదరాబాదుకు వచ్చారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసానికి బాలయ్య వెళ్లారు. అనంతరం తుపాను బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 25 లక్షల చెక్కును చంద్రబాబుకు అందజేశారు. తిత్లీ తుపాను వల్ల శ్రీకాకుళం జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే.  
Go Back to Shorts
Chandrababu
Balakrishna
titli
cyclone
cheque

More Telugu News