dr.mnraju: విజయవాడలోని ప్రముఖ నేత్ర వైద్య నిపుణుడు ఎం.ఎన్‌.రాజు మృతి

షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ నేత్ర వైద్య నిపుణుడు ఎం.ఎన్‌.రాజు శనివారం గుండెపోటుతో మృతి చెందారు. వృత్తికి సేవా దృక్పథాన్ని జోడించి వేలాది మందికి ఆపరేషన్‌లు చేసిన వ్యక్తిగా డాక్టర్‌ రాజుకు గుర్తింపు ఉంది. విజయవాడ గవర్నర్‌ పేటలోని సంధ్య ఐ హాస్పటల్‌ అధినేతగా రాజుకు మంచి పేరుంది.

నేత్ర వైద్యునిగా విస్తృత స్థాయిలో వైద్య శిబిరాలు నిర్వహించడమేకాక  ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టే వ్యక్తిగా ప్రజల ఆదరాభిమానాలను రాజు సొంతం చేసుకున్నారు. ఆయన ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. పలు జర్నలిస్టు సంఘాలు కూడా రాజు మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ ఎందరో పాత్రికేయులకు ఉచితంగా నేత్ర పరీక్షలు, ఆపరేషన్లు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
Go Back to Shorts
dr.mnraju
died
Vijayawada

More Telugu News