అలియా భట్ ను కలిసిన మహేశ్ తనయ సితార
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అలియా భట్ ను కలిసిన మహేశ్ తనయ సితార

  • ఫ్యామిలీతో న్యూయార్క్ వెళ్లిన మహేశ్ 
  • రిషికపూర్ కోసం అక్కడికి వచ్చిన అలియా 
  • అలియా అంటే మహేశ్ కూతురికి ఇష్టం 
హిందీ సినిమా యువ ప్రేక్షకులలో అలియా భట్ కి ఒక రేంజ్ లో క్రేజ్ వుంది. తెలుగు .. తమిళ భాషల్లోను ఆమెను ఆరాధించేవాళ్లు ఎక్కువే. అలాంటి అలియా భట్ ను మహేశ్ బాబు కూతురు సితార న్యూయార్క్ లో కలుసుకుని ఆమెతో ఒక ఫోటో దిగింది. ఆ ఫోటోను తన ఇన్ స్టా గ్రామ్ లో నమ్రత శిరోద్కర్ పోస్ట్ చేసింది.

బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ తో అలియా భట్ కి గల సాన్నిహిత్యం గురించి తెలిసిందే. రణ్ బీర్ కపూర్ తండ్రి రిషికపూర్ వైద్య పరీక్షల నిమిత్తం న్యూయార్క్ లో వున్నారు. ఆయనను కలవడానికి గాను అలియా అక్కడికి వెళ్లింది. ఇక మహేశ్ బాబు తన 'మహర్షి' సినిమా షూటింగ్ న్యూయార్క్ లో జరుగుతుండగా, ఫ్యామిలీతో కలిసి అక్కడికి వెళ్లాడు. షూటింగ్ విరామ సమయంలో న్యూయార్క్ లో విహరించారు. ఆ సమయంలోనే అలియా భట్ ను కలిసి ఫోటో దిగడం జరిగింది. "సితారకి అలియా అంటే ఎంతో ఇష్టం .. తన ముఖంలోని చిరునవ్వుకు కారణమైన అలియాకి ధన్యవాదాలు' అంటూ నమ్రత ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, రాసుకొచ్చారు.    
alia bhatt
sitara

More Telugu News