అటవీశాఖ అధికారులకు షాకిచ్చిన స్మగ్లర్లు.. కిటికీ ఊచలు తొలగించి జంప్!
- కడప జిల్లా రాజంపేటలో ఘటన
- 11 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేసిన అధికారులు
- అందరూ తమిళనాడు వాసులేనని వెల్లడి
జిల్లాలోని రాజంపేట అటవీ అధికారులు ఇటవల నిర్వహించిన దాడుల్లో తమిళనాడుకు చెందిన 11 మంది స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను తరలిస్తూ దొరికిపోయారు. దీంతో వీరిని అధికారులు కస్టడీలోకి తీసుకుని కేసు నమోదుచేశారు.
అనంతరం అటవీశాఖ భవనంలోని ఓ గదిలో వీరిని బంధించారు. అయితే వీరిని పట్టించుకోవడం మానేశారు. దీంతో స్మగ్లర్లు కిటికీ ఊచలను వంచి అక్కడి నుంచి పారిపోయారు. దీంతో తలలు పట్టుకోవడం జిల్లా అధికారుల వంతయింది.