తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని.. దారుణంగా చంపేసిన తనయులు!
- తల్లి వివాహేతర సంబంధంతో కొడుకుల మనస్తాపం
- అడ్డు తొలగించుకునేందుకు హత్యకు కుట్ర
- కిరాతకంగా చంపేసిన నిందితులు
తల్లిదండ్రులు విడిపోవడం, తల్లి మరో వ్యక్తికి దగ్గర కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కుమారులు జావిద్‌ను హత్య చేయాలని ప్లాన్ చేశారు. సవతి తల్లి కుమారుడైన మహ్మద్ ఈసా (21)లో కలిసి జావిద్ హత్యకు కుట్ర పన్నారు. గురువారం రాత్రి వివాహిత అరబ్ నుంచి కుమారుల కోసం జావిద్ ద్వారా డబ్బులు పంపింది. ఆ డబ్బులు ఇచ్చేందుకు వచ్చిన జావిద్‌పై ముగ్గురూ మారణాయుధాలతో దాడిచేశారు. గొంతు, కడుపులో కత్తితో విచక్షణ రహితంగా పొడిచారు. అనంతరం అతడి మర్మాంగాలు కోసం హత్య చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.