maoists: మన్యాన్ని ధ్వంసం చేస్తున్న టీడీపీ నాయకులను తరిమికొట్టాలి: మావోయిస్టుల లేఖ

షార్ట్స్‌లో చూడండి
క్వారీ ముసుగులో మన్యాన్ని ధ్వంసం చేస్తున్న టీడీపీ నాయకులను తరిమి కొట్టాలని మావోయిస్టులు హెచ్చరించారు. ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ మేరకు ఓ లేఖ రాశారు. మావోయిస్టు ఈస్ట్ డివిజన్ గాలికొండ ఏరియా కమిటీ కార్యదర్శి గోపి పేరుతో ఈ లేఖను విడుదల చేశారు.

టీడీపీ నేతలు, బంధువులు మన్యంలో క్వారీల పేరిట ఆదివాసీల పంట భూములను ధ్వంసం చేసేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు. మన్యంలో లేటరైట్ పేరుతో బాక్సైట్ ను తరలిస్తున్నారని, గిరిజన సంపదను దోచుకుంటున్నారని పేర్కొన్నారు. క్వారీ లీజులను ఆపాలని, గనులను తవ్వుకుపోతున్న నేతలను తరిమికొట్టాలని అన్నారు. ఏపీని బహుళజాతి కంపెనీలకు ధారాదత్తం చేశారని, మోసపూరిత ప్రకటనలతో చంద్రబాబు మరోసారి అధికారంలోకి రావాలని పాకులాడుతున్నారని ఆ లేఖలో విమర్శించారు.  
Go Back to Shorts
maoists
letter
Telugudesam
warning

More Telugu News