trivikram: త్రివిక్రమ్ మూవీలో ఒక్క కామెడీ మాత్రమే ఉండాలంటే ఎలా?: ఎన్టీఆర్

  • కథకి కామెడీ అడ్డుపడుతోంది 
  • కామెడీని ఇరికించే ప్రయత్నం చేయలేదు 
  • కథను పాడు చేయదలచుకోలేదు

త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా భారీ వసూళ్లతో తన సత్తా చాటుకుంటోంది. త్రివిక్రమ్ నుంచి ఎన్టీఆర్ కి సూపర్ హిట్ పడినందుకు ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కలిసి ఎన్టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు.

సాధారణంగా త్రివిక్రమ్ సినిమాల్లో కామెడీ ఎక్కువగా ఉంటుంది. అది ఈ సినిమాలో తగ్గిందనే అభిప్రాయాన్ని ఆడియన్స్ వ్యక్తం చేస్తున్నారనే విషయాన్ని యాంకర్ ప్రస్తావించింది. అందుకు ఎన్టీఆర్ స్పందిస్తూ .. "వీరరాఘవుడి తండ్రి చనిపోయాడు .. హీరో ఒక సొల్యూషన్ వెతుక్కోవడానికి వెళుతున్నాడు. ఆ సమయంలో కామెడీ చేస్తే బాగుంటుందా? ఈ సినిమాలో నరేశ్ గారు .. ఆకు బ్యాచ్ .. హీరోయిన్ కామెడీ చేశారుగా. త్రివిక్రమ్ గారు ఒక్కోసారి ఒక్కో కథ రాస్తారు. ప్రతిసారి ఆయన కామెడీ కథనే రాయాలని ఏముంది? ఆయనని ఒక చట్రంలోకి తోసేస్తే ఎలాగా?" అన్నారు.

అప్పుడు త్రివిక్రమ్ అందుకుంటూ .. "ఈ కథకి కామెడీ వలన రసభంగం జరుగుతుందని అనిపించింది. సెకండాఫ్ లో పాట పెట్టడానికి కూడా భయపడిపోయాం. కామెడీ లేకపోతే ఎలాగా? అని భయపడలేదు. కామెడీ ఈ కథలో కూర్చోవడం లేదు .. కథను పాడు చేయడం ఇష్టంలేకనే కామెడీని ఇరికించే ప్రయత్నం చేయలేదు" అని చెప్పుకొచ్చారు.    

More Telugu News