హైదరాబాద్ లో మళ్లీ భారీ వర్షం

  • జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో వర్షం
  • పలు ప్రధాన కూడళ్లలో నిలిచిన ట్రాఫిక్  
  • ఇబ్బంది పడుతున్న వాహనదారులు
హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, మోతీనగర్, రాజీవ్ నగర్, బషీర్ బాగ్, ఆబిడ్స్, కోఠి, దిల్ సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట, ఎల్బీనగర్, వనస్థలిపురం,హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రం భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు. నగరంలోని పలు ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ నిలిచిపోయింది.

కాగా, హైదరాబాద్ లో ఈరోజు ఉదయం సుమారు మూడు గంటల పాటు వర్షం కురిసింది. దీంతో, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, ఇతర పనుల నిమిత్తం బయటకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  
Go Back to Shorts
Hyderabad
rain
traffic

More Telugu News