తెల్లవారుజామున కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

  • ట్రాలీ ఆటోను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం
  • ఆరుగురు మృతి.. 15 మందికి తీవ్ర గాయాలు
  • కర్నూలు నుంచి ఎల్లార్తి దర్గాకు వెళ్తుండగా ప్రమాదం
కర్నూలు జిల్లాలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రాలీ ఆటోను ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆలూరు మండలం పెద్దహోతూరు గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాద సమయంలో ట్రాలీ ఆటోలో 21 మంది ప్రయాణిస్తున్నారు. వీరంతా కర్నూలుకు చెందినవారు. చిన్నారికి పుట్టు వెంట్రుకలు తీయించేందుకు కర్నూలు నుంచి ఎల్లార్తి దర్గాకు వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరణించిన వారిలో ముగ్గురు యువకులు, ఇద్దరు చిన్నారులు, ఒక మహిళ ఉన్నారు. 
Go Back to Shorts
Kurnool District
Road Accident
aluru

More Telugu News