YSRCP: ‘తిత్లీ’ బాధితులకు వైసీపీ సాయంపై టీడీపీ ఎంపీ ప్రశంసలు

షార్ట్స్‌లో చూడండి
‘తిత్లీ’ తుపాన్ తో దెబ్బతిన్న శ్రీకాకుళం జిల్లా వాసులను ఆదుకునేందుకు పలువురు సినీ, వ్యాపార ప్రముఖులు తమ వంతు సాయం ఇప్పటికే ప్రకటించారు. ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ కోటి రూపాయలు విరాళంగా ప్రకటించింది. ఈ ప్రకటనపై శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ విరాళం ప్రకటించిన వైసీపీకి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని, రాజకీయాలకు అతీతంగా తుపాన్ బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని రామ్మోహన్ నాయుడు ఓ పోస్ట్ లో కోరారు. 
Go Back to Shorts
YSRCP
Telugudesam
titli
ram mohan naidu

More Telugu News