ఎస్బీఐ కూడా ప్రకటించేసింది.. డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు!
- యోనో యాప్‌లో పండుగల ఆఫర్లు
- 85 శాతం ఈ-కామర్స్ సంస్థలతో ఒప్పందం
- 16-21 మధ్య కొనుగోళ్లపై ఆఫర్లు
దాదాపు 85 శాతం ఈ-కామర్స్ సంస్థలు యోనోతో ఒప్పందం కుదుర్చుకున్నాయని, అమెజాన్, జబాంగ్, మింత్రా, క్యారట్‌లేన్, పెప్పర్ ఫ్రై, ఓయో, యాత్ర, ఈజ్‌మైట్రిప్, ఫస్ట్‌క్రై, ఫెర్న్స్ అండ్ పెటల్స్ వంటి సంస్థలు ఇందులో ఉన్నాయని వివరించింది. ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, గిఫ్ట్, నగలు, ట్రావెల్, ఫర్నిచర్, హాస్పిటాలిటీ రంగంలో పలు ఆఫర్లు ఉన్నట్టు ఎస్బీఐ పేర్కొంది.