గ్యాస్ కట్టర్లతో ఏటీఎంలను బద్దలు కొట్టి... రూ.35 లక్షల చోరీ
- ఎర్నాకుళం, త్రిస్సూర్‌లలో వరుస చోరీలు
- ఒకే ముఠా పనిగా భావిస్తున్న పోలీసులు
- సీసీ కెమేరాలకు పెయింట్ స్ప్రే
త్రిస్సూర్ జిల్లా కోరట్టిలోని ఓ ప్రయివేటు బ్యాంకు ఏటీఎంలో కూడా తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో చోరీ జరిగింది. గుట్టు చప్పుడు కాకుండా ఏటీఎంను పగలగొట్టి రూ.10 లక్షలు దోచుకెళ్లారు. ఈ రెండు చోరీలు ఒకే ముఠా పనేనని పోలీసులు భావిస్తున్నారు. దోపిడికి పాల్పడే ముందే సీసీ కెమేరాలకు పెయింట్ స్ప్రే చేసినట్టు పోలీసులు తెలిపారు.