తమిళనాడు సీఎం పళనిస్వామికి షాకిచ్చిన హైకోర్టు.. అవినీతి ఆరోపణల కేసు సీబీఐకి బదిలీ
- రోడ్డు కాంట్రాక్టులు బంధువులు, అనుచరులకు అప్పగించారంటూ ఆరోపణలు
- పళనిస్వామికి క్లీన్ చిట్ ఇచ్చిన విజిలెన్స్
- హైకోర్టును ఆశ్రయించిన డీఎంకే
ఈ నేపథ్యంలో డీఎంకే హైకోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన జస్టిస్ ఏడీ జగదీష్ ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్టు తెలిపారు. విచారణ పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతోనే సీబీఐకి అప్పగిస్తున్నట్టు చెప్పారు. వారం రోజుల్లోగా డాక్యుమెంట్లన్నింటినీ సీబీఐకి అప్పగించాల్సిందిగా విజిలెన్స్ విభాగాన్ని ఆదేశించారు.