varla ramaiah: అపర కుబేరుడైన కన్నా నివాసాలపై ఐటీ దాడులెందుకు చేయట్లేదు?: వర్ల రామయ్య

షార్ట్స్‌లో చూడండి
ఏపీలో ఐటీ అధికారుల దాడులు జరుగుతుండటంపై టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శలు చేశారు. రాజకీయ ప్రత్యర్థులపై ఐటీ దాడులు చేయించి భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నారని విమర్శించారు. ‘ఆపరేషన్ గరుడ’లో భాగంగానే ఈడీ, ఐటీ శాఖాధికారులు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.

టీడీపీ నేత సీఎం రమేష్ నివాసాల్లో జరుగుతున్న ఐటీ దాడులపై వర్ల రామయ్య స్పందిస్తూ, ఎక్కడెక్కడ ఐటీ దాడులు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? చెప్పాలని డిమాండ్ చేస్తూ పీఏసీ లో సభ్యుడిగా ఉన్న సీఎం రమేష్ ఇటీవల నోటీసులిచ్చారని అన్నారు. ఆ నోటీసులిచ్చినందుకు సీఎం రమేష్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బీజేపీ నేతలకో న్యాయం.. టీడీపీ నేతలకో న్యాయమా? అని ప్రశ్నించిన వర్ల, అపరకుబేరుడైన కన్నా లక్ష్మీనారాయణపై ఎందుకు దాడులు చేయడం లేదని ప్రశ్నించారు.
Go Back to Shorts
varla ramaiah

More Telugu News