కరీంనగర్ జిల్లాలో మరో పరువు హత్య!
- శంకరపట్నం మండలం తాడికల్ లో పరువుహత్య
- కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్న కుమార్ అనే యువకుడు
- ఇది పరువుహత్యే అంటున్న మృతుడి బంధువులు
కుమార్ మరణంతో అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. యువతి బంధువులే కుమార్ ను చంపేశారని, ఇది ముమ్మాటికీ పరువుహత్యేనని మృతుడి కుటుంబీకులు ఆరోపించారు. కుమార్ మరణంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విచారణకు వచ్చిన పోలీసు వాహనాన్ని కూడా గ్రామస్తులు ధ్వంసం చేశారు. జీపు అద్దాలను పగలగొట్టారు. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. మరోవైపు పోలీసులు మాట్లాడుతూ, ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని చెప్పారు.