'పరదేశి' సినిమాలో హీరో ఛాన్స్ కోసం ట్రై చేశాను: కౌశల్
- 'పరదేశి' సినిమాకి సెలెక్ట్ కాలేదు
- 'రాజకుమారుడు'లో నటించాను
- అమ్మ చెప్పిన మాటలనే అనుసరిస్తున్నాను
ఆ పది మంది అబ్బాయిల్లో నేను ఒకడిని. నాతో పాటు శివాజీ .. లయ .. ప్రత్యూష కూడా వున్నారు. ఆ సినిమాలో హీరోగా నేను సెలెక్ట్ కాకపోయినా, ఆ తరువాత 'రాజకుమారుడు' సినిమాలో మహేశ్ బాబు ఫ్రెండ్ గా నటించాను. అలా నటుడిగా నా కెరియర్ మొదలైంది" అని చెప్పుకొచ్చాడు. ''మా అమ్మగారికి నేనంటే చాలా ఇష్టం .. జీవితమంటే పుట్టడం .. ఎంజాయ్ చేయడం .. చనిపోవడం కాదు, జీవితమంటే సాధించడం అని చెబుతూ ఉండేది. చనిపోయిన తరువాత మన గురించి పదిమంది గొప్పగా చెప్పుకోవాలని చెబుతుండేది .. ఆ మాటలనే నేను అనుసరిస్తూ వస్తున్నాను" అని అన్నాడు.